తెలంగాణా తోలి C.M గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే కే.సి.అర్ కి ఘోర అవమానం జరిగింది. అధికారులు చేసిన తప్పు వల్ల ముఖ్యమంత్రి హోదాలో అయన చేసిన తోలి సంతకం ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కుంది. తెలంగాణా రాజముద్ర తప్పుల తడకగా ఉందని హర్యనకి చెందిన సామాజిక వేత నరేష్ కుద్యాన్ ఆరోపిస్తున్నారు. భారతీయ ఎంబ్లం చట్ట ప్రకారం సదరు ముద్ర రాజ్యంగా విరుద్దమంటూ కేంద్ర హోంశాక కి ఫిర్యాదు అందింది. "సత్యమేవ జయతే " అన్న శాసనాన్ని అశోకుడి మూడు సింహాల క్రింద బాగంలో పొందు పరచలేదంటు అయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సదరు రాజముద్రలో మూడు సింహాల గుర్తు పైన ఉంటె సత్యమేవ జయతే అన్నశాసనం ఎక్కడో క్రింద భాగాన ఉంది అన్నారు. దీన్ని వెంటనే సరి చేయాలంటూ ఆయన కేంద్ర హోం శాకని కోరారు. ఫిర్యదుని స్వీకరించిన హోంశాక తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించే పనిలో ఉంది. 2005వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎంబ్లం చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఇది తెలియని తెలంగాణా ప్రభుత్వ అధికారులు కూడ అదే తప్పుని రిపీట్ చేశారు.
No comments:
Post a Comment